Samantha | టాలీవుడ్ హీరోయిన్ సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. తనకు సంతోషం కలిగినా, బాధ కలిగినా.. ప్రతీ విషయాన్ని ఆమె తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అలానే తాజాగా సమంత సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఇటీవల తాను చికెన్ గున్యా వ్యాధి బారిన పడినట్లు సమంత తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్టు ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను సమంత్ షేర్ చేసింది. చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పులు నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటుందంటూ ఆ బ్యూటీ రాసుకొచ్చారు. సమంత త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
గతంలో సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఖుషి మూవీ టైమ్‌లో తాను ఈ వ్యాధి బారిన పడినట్లు ఆమె తెలిపింది. అప్పట్నుంచి తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పింది. మయోసైటిస్ చికిత్స కోసం మెడిసిన్స్, ఆయుర్వేదం, భూటాన్‌లో ప్రకృతి వైద్యం ఇలా రకరకాల పద్ధతుల్ని సమంత ప్రయత్నించింది.
“Recovering from Chikungunya is so fun 😌 😌 😌 The joint pains and ALL”
~Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu#CitadelHoneyBunny #RaktBramhand#MaaIntiBangaram pic.twitter.com/m94S1yMV8R— Samcults (@Samcults) January 10, 2025
ఇవి కూడా చదవండి..
Prabhas | గోదారమ్మాయిని పెళ్లాడనున్న ప్రభాస్..! హింట్ ఇచ్చిన రామ్‌చరణ్
Traffic | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
Prabhas Raaja Saab | సంక్రాంతి స్పెషల్.. ‘రాజా సాబ్’ నుంచి క్రేజీ అప్డేట్.?