Prabhas | టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే.. అది మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆయన పెళ్లి కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశమంతా ఎదురుచూస్తోంది. ప్రపంచంలోని ఫ్యాన్స్ కూడా ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ను రెబల్ స్టార్ పెళ్లాడుతారని అనేక వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అలాందేమీ జరగలేదు. ఓ రెండేండ్ల క్రితం భీమవరానికి చెందిన రాజుల అమ్మాయిని పెళ్లాడుతారని వార్తలు షికారు చేశాయి. ఈ వార్తలు కూడా గాసిప్‌గానే మిగిలిపోయాయి. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ పెళ్లిపై వార్తలు షికారు చేస్తున్నాయి.
ప్రభాస్ పెళ్లిపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హింట్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్స్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షోలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. బాలయ్య.. ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించారు. అవును.. షోలో ప్రభాస్ ఏ ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ అమ్మాయి ఎవరో కాదు.. పదహారు అణాల తెలుగు అమ్మాయి. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడబోతున్నట్లు చరణ్ వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వార్త నిజం కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. త్వరలోనే ప్రభాస్‌ను పెళ్లిపీటలపై చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
గతేడాది దసరా వేడుకల్లో విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్న ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామల దేవిని మీడియా పెళ్లి గృయించి అడగగా ఆమె సమాధానమిస్తూ.. “దీర్ఘ కాలం నుండి వేచి చూస్తున్న పెళ్ళికి సంబంధించిన అనౌన్స్మెంట్ త్వరలోనే ఉండబోతుంది. పైనున్న కృష్ణం రాజు గారు అన్ని సవ్యంగా చూసుకుంటారు. ఇప్పటి వరకు అనుకున్నావని అనుకున్నట్లే అయ్యాయి. మా కుటుంబం మొత్తం ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఒక ఇంటి వాడవుతాడా అంటూ వెయిట్ చేస్తున్నాము” అన్నారు. దీంతో ప్రభాస్ కళ్యాణ ఘడియలు దగ్గర పడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘ది రాజా సాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజి’ వంటి సినిమాలతో పాటు హోంబలే ఫిల్మ్స్‌లో ఇప్పుడు చేస్తున్న ‘సలార్ 2’ కాకుండా మరో రెండు సినిమాలకు సైన్ చేశాడు.