హీరోగా కెరీర్ మొదలుపెట్టి..ఆ తర్వాత విలన్‌గా భయపెట్టించాడు.మళ్లీ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సినీ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు గోపీచంద్ (Gopichand). ఈ ఏడాది మారుతి డైరెక్షన్లో ఫన్ ఎంటర్ టైనర్ పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అప్పడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే గోపీచంద్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటాడని తెలిసిందే.
ఎప్పుడో ఒకసారి గోపీచంద్ ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట కనిపిస్తుంటాయి. గోపీచంద్ తన చిన్న కొడుకు వియాన్ (Viyan)తో కలిసి దిగిన స్టిల్స్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తండ్రీకొడుకులిద్దరూ మ్యాచింగ్ షూట్, డ్రెస్ వేసుకుని కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చారు. గోపీచంద్, వియాన్ చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోలు నెటిజన్ల మనసు దోచేస్తున్నాయి. తండ్రీకొడుకులిద్దరూ పోటీపడి మరి కెమెరాకు ఫోజులిచ్చినట్టు లుక్స్ చూస్తే అర్థమవుతుంది.
గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే శ్రీవాసు-గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన లౌక్యం, లక్ష్యం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ రాబోతుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
Read Also : Nandamuri Balakrishna | సినిమాల్లోకి బాలకృష్ణ చిన్నకూతురు..క్రేజీ టాక్‌లో నిజమెంత ?
Read Also : Yashoda | డేట్‌ను రౌండప్ చేస్తూ.. యశోద సినిమా విడుదలపై సమంత టీం హింట్ ..!
Read Also :Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క