ఒగ్గు కళాకారుల నేపథ్య కథాంశంతో రూపొందించిన చిత్రం ‘బ్రహ్మాండ’. ఆమని, బలగం జయరాం, కొమరక్క, బన్నీ రాజు ప్రధాన పాత్రధారులు. రాంబాబు దర్శకత్వంలో దాసరి సురేష్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఒగ్గు కళాకారుల నేపథ్యంలో చక్కటి ఆధ్యాత్మిక అంశాలు కలబోసిన చిత్రమిదని, తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని ఆమని తెలిపారు. ఆమని నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత దాసరి సురేష్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వరికుప్పల యాదగిరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంబాబు.