Manchu Manoj | మంచు మనోజ్ అరెస్ట్.. మోహన్‌బాబు ఫిర్యాదుతోనేనా?
మంచువారి ఇంట వివాదం కొనసాగుతూనే ఉంది. హీరో మంచు మనోజ్‌ను (Manchu Manoj) పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. తిరుపతిలోని ఇంట్లో ఉన్న మనోజ్‌ను అదుపులోకి తీసుకుని భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కుటుంబ వివాదంలోమోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగానే అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.
Manchu Manoj | మంచువారి ఇంట వివాదం కొనసాగుతూనే ఉంది. హీరో మంచు మనోజ్‌ను (Manchu Manoj) పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. తిరుపతిలోని ఇంట్లో ఉన్న మనోజ్‌ను అదుపులోకి తీసుకుని భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కుటుంబ వివాదంలోమోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగానే అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. కాగా, భాకారాపేట సమీపంలోని ఉర్జా రిసార్ట్‌లో మనోజ్ బస చేస్తున్నారు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత పెట్రోలింగ్‌లో భాగంగా మనోజ్ వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆయన్ను పలు ప్రశ్నలు అడిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. ఇక్కడ సెలబ్రిటీలకు అంత సురక్షితం కాదని సూచించారు. అయితే పోలీసుల డ్రామా అంటూ వారి తీరును తప్పుపట్టిన మనోజ్.. నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే మీకేంటి ఇబ్బంది అంటూ నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది.

నేనేమైనా టెర్రరిస్టునా.. దొంగనా.. అర్ధరాత్రి ఎందుకు నన్ను బెదిరిస్తున్నారని మనోజ్ వారిని అడిగారు. ‘సీఎం పేరు ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నారని, అసలు మీరు నా దగ్గరకు ఎందుకు వచ్చారు? మమ్మల్ని ఎందుకు బెదిరించారో, చెబితే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను’ అంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలోని మెట్లపై మనోజ్ బీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న సీఐ ఇమ్రాన్ భాషా వచ్చి సర్దిచెప్పడంతో ఆయన ఆందోళన విరమించారు. కాగా, కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. యూనివర్సిటీ వద్ద మనోజ్ తన బౌన్సర్లతో ఏమైనా గొడవ చేస్తాడనే అనుమానంతో మోహన్‌బాబు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది.
🚨BREAKING NEWS 🚨#ManchuManoj in Police Custody!
Case filled by #MohanBabu Concerning Family MattersStay Strong @HeroManoj1 brother
We all are with you❤️pic.twitter.com/nI8AEibJDm— BS 🦅 (@biggscreen_offl) February 18, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

