ఈ తరం సినిమా హీరోలందరూ దాదాపు బాడీ ఫిట్నెస్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ బాలీవుడ్ హీరోలందరిలోనూ ఫిట్నెస్ గోల్స్‌కు చాలా హై టార్గెట్స్ పెడుతుంటాడు టైగర్ ష్రాఫ్. ఈ యువహీరో తరుచూ తన కండలు చూపించడమే కాకుండా రకరకాల స్టంట్స్ కూడా చేస్తుంటాడు. తాజా అతను గణ్‌పత్ సినిమా షూటింగ్ పరంగా యూరప్‌లో ఉన్నాడు.
అక్కడ ప్రస్తుతం మైనస్ వన్ డిగ్రీల ఎముకలు కొరికే చల్లని వాతావరణం ఉంది. షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరికినప్పుడు అంతటి చలిలో టైగర్ తన విన్యాసాలు మొదలుపెట్టాడు. ఉదయాన్నే లేచి క్రయోథెరపీ పేరుతో షర్టు లేకుండా కేవలం యెల్లో షార్ట్స్ ధరించి పరుగులు ప్రారంభించాడు.
అలా చలిలో అర్ధనగ్నంగా తన కండలు తిరిగిన బాడీని చూపిస్తూ టైగర్ పరుగులు తీస్తున్న వీడియో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు చాలా కామెంట్లు వస్తున్నాయి. ముందుగా టైగర్ ష్రాఫ్ గర్ల్ ఫ్రెండ్ అయిన దిషా పటానీ ‘లోల్’ అని కామెంట్ చేసింది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ‘వావ్! అంతటి చలిలో ఎలా?’ అని స్పందించింది.
టైగర్ ష్రాఫ్ హీరోగా షూటింగ్ జరుగుతున్న ‘గణ్‌పత్’ చిత్రంలో అతని సరసన కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ చిత్రం జాకీ భగ్నానీ నిర్మిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు హీరోపంతీ అనే సినిమా వచ్చింది. ‘హీరోపంతీ’ టైగర్ హీరోగా నటించిన తొలిసినిమా.. అందులో కూడా కృతి సనన్ హీరోయిన్. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు చిత్రానికి హిందీ రీమేక్‌గా హీరోపంతి తెరకెక్కింది.