Baaghi 4 | బాఘి ప్రాంచైజీలో వచ్చిన హిందీ చిత్రం బాఘి 4. ఏ హర్ష డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కగా.. సోనమ్ బజ్వా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 5న విడుదల బాఘి 4 మూవీ లవర్స్‌ను నిరాశపరిచింది.
కాగా థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేని ఈ సినిమా ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. బాఘి 4 ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీని ప్రస్తుతానికి రెంటల్ బేసిస్ (అద్దె ప్రాతిపదికన) చూసే అవకాశముంది. సబ్స్క్రైబర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే వరకు ఆగాల్సి ఉంది.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటించగా.. హర్మాజ్ సంధు కీలక పాత్రలో నటించారు. నడియాడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్పై నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
#Baaghi4 (Hindi)
Now available for Rent on Primevideo 🍿!!#OTT_Trackers pic.twitter.com/11A0EYNx9t
— OTT Trackers (@OTT_Trackers) October 17, 2025
Read Also :
Rahul Sankrityan | వీడి14లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు : రాహుల్ సంకృత్యాన్
Khalifa Glimpse | పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్‌డే స్పెషల్.. ‘ఖలీఫా’ గ్లింప్స్ విడుదల
Nagarjuna | నాగార్జున 100వ సినిమాపై క్రేజీ అప్డేట్.. టబు స్థానంలో లేడి సూపర్ స్టార్?