Tiger Nageswara Rao | సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘టైగర్ నాగేశ్వరరావు’.. రన్‌టైం ఎంతో తెలుసా..?
Tiger Nageswara Rao | టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
Tiger Nageswara Rao | టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుండగా.. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సెన్సార్ అప్డేట్ వచ్చేసింది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. కాగా.. టైగర్ నాగేశ్వర రావు రన్ టైం 181 నిమిషాలు (3 గంటల 1 నిమిషం) ఉండడం విశేషం. ఇక టైగర్ నాగేశ్వర రావు మాస్ కంటెంట్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
#TigerNageswaraRao censored with U/A ❤🔥
BOOK YOUR TICKETS NOW 🐅
– https://t.co/OGlBJwlYKHThis Dussehra, TIGER will entertain you and your family 🤩
In cinemas from Oct 20th ❤️🔥@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @AAArtsOfficial @NupurSanon @gaya3bh… pic.twitter.com/c5tpaZCfsH
— Ramesh Bala (@rameshlaus) October 18, 2023
ఈ సినిమాలో కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తోండగా.. నుపుర్సనన్కు ఇది టాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ కావడం విశేషం. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో టైగర్ నాగేశ్వర రావు విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

