సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Aug 25, 2020 , 20:38:01

ఈసారి బిగ్ బాస్-4లో గీతామాధురి భ‌ర్త

ఈసారి బిగ్ బాస్-4లో గీతామాధురి భ‌ర్త

టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు బిగ్ బాస్ సీజ‌న్ -4 సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ షోలో పాల్గొనే వారిలో ప‌లువురి పేర్లు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎలాంటి పేర్లు బ‌య‌ట‌కు రాలేదు. కానీ తాజాగా బిగ్ బాస్ తో భాగ‌స్వామ్యం అవుతున్న కంటెస్టంట్ల‌లో ఒక‌రి పేరు అఫీషియల్ గా ప్ర‌క‌టించారు. ఇంత‌కీ అత‌నెవ‌రో అనుకుంటున్నారా..? ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించిన యాక్ట‌ర్‌, గాయ‌ని గీతామాధురి భ‌ర్త నందు.

ఈ విష‌యాన్ని నందు ఇన్ స్టా పోస్ట్ ద్వారా చెప్పాడు. డార్లింగ్స్ నేను బిగ్ బాస్ లో ఉన్నాను. షోలో మ‌న ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. ఈ షోతో మ‌రింత వినోదం మీ ముందుకు రాబోతుంది. మీ సాయం కావాలి. మంగ‌ళ‌వారం మీకు మ‌రో అప్ డేట్ ఇస్తాన‌ని చెప్పాడు నందు. గ‌తంలో గీతామాధురి బిగ్ బాస్ 2 లో పాల్గొని..ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది. 

View this post on Instagram

Announcement ☝️

A post shared by Actor Nandu (@that_actor_nandu) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo