Jailer 2 | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటిస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ జైలర్ 2 (Jailer 2). కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. సీక్వెల్లో శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ పాత్రలు రిపీట్ కానున్నాయని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరో క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సారి మరో స్టార్ యాక్టర్ తలైవా టీంతో జాయిన్ కాబోతున్నాడట. ఇంతకీ అతడెవరనే కదా మీ డౌటు. తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి. జైలర్ 2 ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈ షెడ్యూల్లో విజయ్ సేతుపతిపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. తలైవా, విజయ్ సేతుపతి ఇప్పటికే పేటా సినిమాలో నటించారని తెలిసిందే. ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవు తుందన్న వార్తలపై అధికారిక ప్రకటన ఏం రాకున్నా.. జైలర్ 2పై అంచనాలు మాత్రం మరింత పెరిగిపోతున్నాయి.
జైలర్ 2ను 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని ఇప్పటికే రజినీకాంత్ క్లారిటీ ఇచ్చాడని తెలిసిందే. సీక్వెల్లో బాలీవుడ్ భామ విద్యాబాలన్‌తోపాటు కోలీవుడ యాక్టర్ సంతానం కీలక పాత్రల్లో నటిస్తున్నారని ఇన్సైడ్ టాక్. మరి రాబోయే రోజుల్లో ఈ స్టార్ యాక్టర్లపై అఫీషియల్ అప్డేట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. జైలర్ ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించారని తెలిసిందే.
Karuppu | టాక్ ఆఫ్ ది టౌన్‌గా సూర్య కరుప్పు పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్
Andhra King Taluka Review | ‘ఆంధ్రకింగ్ తాలూకా’ రివ్యూ.. రామ్ పోతినేని హిట్టు కొట్టాడా.?
Kantara Chapter 1 | ‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్ ఇప్పుడు ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసా?