OTT | ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు థియేటర్స్‌లో అంతగా అలరించకపోయిన ఓటీటీలో మాత్రం ప్రభంజనాలు సృష్టిస్తున్నాయి. నితిన్, శ్రీలీల, వార్నర్ ముఖ్య పాత్రలలో రూపొందిన రాబిన్ హుడ్ చిత్రం థియేటర్స్‌లో అంతగా అలరించలేకపోయింది. కాని ఈ మూవీకి ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓ బాలీవుడ్ చిత్రం కూడా థియేటర్లో డబుల్ డిజాస్టర్‌గా మిగిలింది. కాని ఓటీటీలో గత్తర లేపుతుంది. మరి ఆ చిత్రం మరేదో కాదు బాలీవుడ్ లో తెరకెక్కిన బెల్ బాటమ్ . అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. 2021 ఆగస్టు 19న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ మహమ్మారి ఆంక్షల మధ్యే విడుదలైంది.
సినిమా ఇండస్ట్రీని తిరిగి కోలుకునేలా చేసేందుకు బ్రేవ్ స్టెప్‌గా ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి సరైన రెస్పాన్స్ రాలేదు. ‘బెల్ బాటమ్’ మొదటి రోజున కేవలం రూ.2.75 కోట్లు సంపాదించింది. ఈ సినిమా 1980ల నేపథ్యంలో రూపొందగా, ఇందులో వాణి కపూర్ అక్షయ్ భార్యగా యాక్ట్ చేసింది. హుమా ఖురేషి, ఆదిల్ హుస్సేన్, అనిరుద్ధ్ డేవ్ కూడా కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆట్టుకుంటుంది. ‘బెల్ బాటమ్’ మూవీ 1984లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ అయిన ఘటన ఆధారంగా రూపొందిన స్పై థ్రిల్లర్. బందీలను రక్షించడానికి పనిచేసే ధైర్యవంతుడైన RAW (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు.
ఇందులో లారా దత్తా మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించింది.. రంజిత్ ఎం.తివారీ దర్శకత్వం వహించిన ‘బెల్ బాటమ్’ను పూజా ఎంటర్టైన్మెంట్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్, మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ నిర్మించారు. ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, ‘ఈ సినిమాను ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. ఈ కథను ప్రపంచంలో ఉన్న ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మంచి స్క్రిప్ట్, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో ఈ చిత్రం ఉంటుంది. మా కంటెంట్ లైబ్రరీలో అద్భుతమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది అని చెప్పుకొచ్చారు.