అర్జున్ రెడ్డి సినిమాతో తన ఫాలోవర్లను అమాంతం పెంచేసుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). కెరీర్లో తక్కువ టైంలోనే స్టార్ డమ్ సంపాదించిన ఈ యువ హీరో యాక్టింగ్‌కు ఫిదా అయ్యే వారిలో మూవీ లవర్స్, అభిమానులే కాదు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. విజయ్ అంటే ఇష్టపడే సెలబ్రిటీల్లో ముందు వరుసలో ఉంటుంది అందాల తార జాన్వీకపూర్ (Janhvi Kapoor). విజయ్ ఎందుకు పాపులరో జాన్వీకపూర్ చెప్పిన మాటలే చెప్తున్నాయి.
జాన్వీకపూర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది. తనకు విజయ్‌తో నటించాలని ఉందని చెప్పిన జాన్వీ..విజయ్ గిఫ్టెడ్ యాక్టర్ అంటూ కితాబిచ్చింది. విజయ్ దేవరకొండ పెద్ద స్టార్, సినిమాటిక్ యాక్టర్ మాత్రమే కాదని, గొప్ప వ్యక్తి కూడా అని ఆకాశాకెత్తేసింది జాన్వీ కపూర్. స్టార్‌గా మాత్రమే కాకుండా వ్యక్తిత్వంతో ఎంతోమంది మనసులో స్థానం సంపాదించుకున్నాడని చెప్పి..విజయ్ పాపులారిటీ వెనుకున్న సీక్రెట్ ఏంటో చెప్పింది.
ఆగస్టు 25న పాన్ ఇండియా చిత్రం లైగర్ (Liger)తో తియేటర్లలో సందడి చేయనున్నాడు విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.