Aamir khan | మీడియాకు అమీర్ ఖాన్ క్షమాపణలు..కారణమిదే..!
ఆగస్టు 11న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయేందుకు ముస్తాబవుతుంది లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha). ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ అండ్ టీం స్పెషల్ స్క్రీనింగ్స్ వేస్తూ..ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది.
బాలీవుడ్ (Bollywood) హీరో అమీర్ ఖాన్ (Aamir khan) లీడ్ రోల్ చేస్తున్న చిత్రం లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha). ఆగస్టు 11న గ్రాండ్‌గా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదలయేందుకు ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ అండ్ టీం స్పెషల్ స్క్రీనింగ్స్ వేస్తూ..ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది. హైదరాబాద్ ఏఎంబీ మాల్లో ఇప్పటికే స్పెషల్ ప్రీమియర్ వేశారు.
కాగా ఇవాళ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే అనుకోని కారణాలతో ప్రెస్ మీట్ ఆలస్యమవడంతో మీడియాకు క్షమాపణలు చెప్పాడు అమీర్ ఖాన్. లాల్ సింగ్ చడ్డా అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంటుందని ఈ సందర్భంగా అన్నాడు అమీర్‌ఖాన్. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) కీ రోల్ పోషిస్తున్నాడు.
చైతూ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ప్రాజెక్టులో కరీనా కపూర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తెలుగు వెర్షన్‌ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సమర్పిస్తున్నాడు.
Read Also : Rakul Friendship Day | స్నేహితులతో రకుల్ డ్యాన్స్..వీడియో ట్రెండింగ్
Read Also : Sita Ramam | సక్సెస్ ట్రాక్‌లో ‘సీతారామం’..అంతటా హౌస్‌ఫుల్..!
Read Also : Alia Bhatt | అలియాభట్ సోషల్ మీడియా పోస్ట్ చాలా కాస్లీ గురూ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

