Sita Ramam | సక్సెస్ ట్రాక్‌లో ‘సీతారామం’..అంతటా హౌస్‌ఫుల్..!
సీతారామమ్ (Sita Ramam) చిత్రం తొలి రోజు నుంచి మంచి టాక్‌తోపాటు కలెక్షన్లకు కూడా రాబడుతుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించాడు. జెర్సీ ఫేం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మెయిన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. రష్మిక మందన్నా మరో ఫీ మేల్ లీడ్ రోల్లో మెరిసింది.
హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో వార్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ ప్రేమకథగా వచ్చిన చిత్రం సీతారామమ్ (Sita Ramam). మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించాడు. జెర్సీ ఫేం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మెయిన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. రష్మిక మందన్నా మరో ఫీ మేల్ లీడ్ రోల్లో మెరిసింది. కాగా ఈ చిత్రం తొలి రోజు నుంచి మంచి టాక్‌తోపాటు కలెక్షన్లను కూడా రాబడుతుంది.
శుక్రవారంతోపాటు రెండో రోజైన శనివారం కూడా చాలా ప్రాంతాల్లో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయట. అంతేకాకుండా చాలా ఏరియాల్లో మరిన్ని థియేటర్లు కూడా యాడ్ అయ్యాయని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ట్రేడ్ సర్కిల్ ప్రకారం మల్టీప్లెక్స్, ఏ సెంటర్స్ తోపాటు బీ, సీ సెంటర్లలో కూడా శనివారం సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అయింది సీతారామం. పీరియాడిక్ లవ్ స్టోరీకి ప్రేక్షకులు, క్రిటిక్స్ ఫిదా అయిపోతున్నారట.
లీడ్ పెయిర్ నటన, హను రాఘవపూడి అద్బుతమైన రచన, దర్శకత్వం, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, పీఎస్ వినోద్ స్టన్నింగ్ విజువల్స్, వైజయంతీ మూవీస్-స్వప్నా సినిమాస్ అత్యున్నత సాంకేతిక విలువలు..ఇలా ప్రతీ ఒక్కటి సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ట్రేడ్ పండితులు, మూవీ లవర్స్. ఈ చిత్రంలో సుమంత్ బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో నటించగా..భూమికా చావ్లా, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ కీ రోల్స్ పోషించారు.
Read Also : Rakul Friendship Day | స్నేహితులతో రకుల్ డ్యాన్స్..వీడియో ట్రెండింగ్
Read Also : Aamir khan | మీడియాకు అమీర్ ఖాన్ క్షమాపణలు..కారణమిదే..!
Read Also : Alia Bhatt | అలియాభట్ సోషల్ మీడియా పోస్ట్ చాలా కాస్లీ గురూ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

