గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవల తన భర్త పేరుని సోషల్ మీడియా నుండి తొలగించి వార్తలలోకి ఎక్కిన విషయం తెలిసిందే. ప్రియాంక తీసుకున్న నిర్ణయంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇద్దరు విడిపోతున్నారా ఏంటి అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా తల్లి వారిద్దరు విడిపోవడం లేదు. సంతోషంగా ఉన్నారని బదులు ఇచ్చింది. అయితే ప్రియాంక తన భర్త పేరు ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ఆరాలు తీయగా, అసలు విషయం బయటపడింది.
ఇటీవలి కాలంలో చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని, న్యూమరాలజీని చాలా మంది నమ్ముతున్నారు. అందులో భాగంగానే ప్రియాంక కూడా తన పేరు చివర ఉన్న చోప్రా, జోనాస్ అనే పదాలను తొలగిస్తే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం లైఫ్ బాగుంటుందని రెండు పదాలను తొలగించి కేవలం ప్రియాంకగా కొనసాగనున్నట్లు చెప్పింది. అందుకనే సోషల్ మీడియాలో ప్రియాంక అనే పదాన్ని మాత్రమే ఉంచానని చెప్పింది.
ప్రియాంక నటించిన తాజా హాలీవుడ్ చిత్రం.. మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే జీ లే జరా అనే బాలీవుడ్ మూవీలోనూ ఆమె త్వరలో నటించనుంది. మూడేళ్ల క్రితం హాలీవుడ్ పాపులర్, పాప్ సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రియాంక. ఇండియన్ కల్చర్ ప్రకారం జోద్పూర్ ప్యాలెస్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.