Game Changer | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా ఒకో పాటను విడుదల చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతోంది రాంచరణ్ టీం. తాజాగా ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచే సన్నివేశం ఒకటి ఉందన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సీన్లో రాంచరణ్ చెప్పే లెంగ్తీ డైలాగ్ ఒకటి సినిమాకే మెయిన్ హైలెట్‌గా ఉండబోతుందని ఫిలినగర్ సర్కిల్ సమాచారం.
అంతేకాదు ఈ సీన్లో రాంచరణ్ డైలాగ్ డెలివరీ చూసి ప్రేక్షకులంతా ఆశ్చర్యపోవడం పక్కా అట. శంకర్ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయని తెలిసిందే. మరి రాంచరణ్‌తో ఎలాంటి డైలాగ్స్ చెప్పిస్తాడని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా..ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Fahadh Faasil | వెడ్డింగ్‌లో పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్.. ఇంతకీ ఎవరిదో తెలుసా..?
The Girlfriend | రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్‌కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?