Kanchana 4 | హార్రర్ కామెడీ జోనర్ సినిమాలకు దక్షిణాదితోపాటు ఉత్తరాది ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుందని తెలిసిందే. ఇదే జోనర్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ప్రాంఛైజీ కాంచన. టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవా లారెన్స్ (Raghava Lawrence) కాంపౌండ్ నుంచి ఈ ప్రాంఛైజీలో ఇప్పటికే మూడు పార్టులు రాగా.. ఇప్పుడిక కాంచన 4 (Kanchana 4) టైం కూడా వచ్చేసింది.
ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయని తెలిసిందే. అంతేకాదు బీటౌన్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుందని మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత మనీశ్ షా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని గోల్డ్ మైన్ ఫిలిమ్స్ తెరకెక్కించనుంది.
ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులను ఫైనల్ చేయాల్సి ఉందని ఇప్పటికే ఓ చిట్‌చాట్‌లో చెప్పాడు మనీశ్ షా. కాంచన 4 జనవరి లేదా ఫిబ్రవరి 2025లో సెట్స్‌పైకి వెళ్లనుందని.. హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కించబోతున్నామని చెప్పారు. ఈ మూవీ రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రాబోతుందని ఇన్సైడ్ టాక్.
కాంచన 4 గురువారం ప్రారంభమైంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత డిజిటల్ విడుదల అవుతుందని మనీష్ షా స్పష్టం చేశారు. హిందీ వెర్షన్ కూడా జాతీయ స్థాయిలో విడుదలవుతుందన్నారు మనీశ్ షా. కాంచన సిరీస్‌కు హిందీలో కూడా మంచి క్రేజ్ ఉంది.
ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిందీలో లక్ష్మీగా రీమేక్ చేశారు. ఈ సీజన్లో హార్రర్ సినిమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. కాంచన 4 కంటెంట్ క్లిక్ అయితే మాత్రం అది నిస్సందేహంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే సినిమాగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Raghava Lawrence’s #Kanchana4 will be Produced by Goldmine films !!
The budget of the movie is said to be 100Crs 👀#PoojaHegde is in the final talks for one of the female lead ✨
Script work has been completed & movie will kick-start soon 🎥 pic.twitter.com/hqwkkpRek4— AmuthaBharathi (@CinemaWithAB) September 11, 2024
MASS Jathara | రవన్న మాస్ దావత్ షురూ.. రవితేజ మాస్ జాతర గ్లింప్స్ వచ్చేస్తుంది