Thiruveer | జార్జిరెడ్డి, టక్ జగదీశ్, పరేషాన్, మసూద సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు తిరువీర్. ఇటీవలే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తిరువీర్ భరత్ భూషణ్ డైరెక్షన్లో సినిమా లాంచ్ చేశాడని తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా మొదలైంది.
గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 19 నుంచి సెట్స్‌పైకి కూడా వెళ్లనుంది. కాగా ఇప్పుడు తిరువీర్‌కు సంబంధించిన మరో సినిమా వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లకముందే మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు డైలాగ్ రైటర్ కృష్ణ చేపూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా ఫైనల్ అయిందట.
బేబితో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న శ్రీనివాస్ కుమార్ (ఎస్కేఎన్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డ్రాగన్, డ్యూడ్ సినిమాలకు పనిచేశాడు కృష్ణ చేపూరి. ఇంకా టైటిల్ కాని ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. మొత్తానికి సైలెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఓకే చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు తిరువీర్.
భరత్ భూషణ్ డైరెక్షన్లో తిరువీర్ చేస్తున్న చిత్రానికి భరత్ మాచిరాజు సంగీతం అందిస్తున్నాడు. సీహెచ్ కుశేందర్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్న ఈ మూవీ అన్ని దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన తిరువీర్ ఈ సినిమాతో సౌతిండియాలో మంచి పాపులారిటీ తెచ్చుకోబోతున్నాడని అర్థమవుతోంది.
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ