తిరువీర్ కథానాయకుడిగా మహేందర్ కుడుదుల దర్శకత్వంలో ఆధ్య మూవీ మేకర్స్ పతాకంపై పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ క్లాప్ ఇవ్వగా, నిర్మాత దామోదర ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు స్వరూప్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. అతిథులంతా చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. పల్లెటూరి నేపథ్యంలో సరదాగా, సందడిగా సాగే ప్రేమకథ ఇదని, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి.