Ravi Teja | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న టాలీవుడ్ యాక్టర్లలో ఒకరు రవితేజ. తనదైన మ్యానరిజంతో ఎంటర్టైన్ చేయడం రవితేజ స్టైల్. క్లాస్, మాస్, యాక్షన్, కామెడీ.. ఇలా జోనర్ ఏదైనా అందులో రవితేజ మార్క్ ఎలిమెంట్స్ కనిపిస్తుంటాయి. చాలా కాలంగా సరైన హిట్స్ లేక ఢీలా పడిపోయిన రవితేజ మళ్లీ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో క్రాక్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు.
అయితే రవితేజ సినిమాలు రొటీన్‌గా ఒకే పంథాలో ఉంటున్నాయంటూ నెట్టింట పలువురు కామెంట్స్ చేశారని తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ ఎప్పుడూ నెగెటివిటీతో నిండి ఉంటుందని రీసెంట్గా కామెంట్స్ చేశాడు రవితేజ. ఇప్పుడు మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి అందరి అటెన్షన్ తనవైపునకు తిప్పుకుంటున్నాడు. ఈ ట్విటర్ మేధావులు థియేటర్లకు అస్సలు వెళ్లరు. జనాలు నన్ను గీతాంజలి లాంటి సినిమాలో చూడరు. నేను నిజాయితీగా ప్రయత్నించినప్పుడల్లా ఆ సినిమాలను ప్రోత్సహించలేదన్నాడు రవితేజ. మనం ఏం చేసినా పర్వాలేదు.. వాళ్లు (ట్విటర్ జనాలు) కామెంట్స్ చేస్తూనే ఉంటారు.
నేను ఒకే రకమైన సినిమాలు చేస్తున్నానని వారు చెబుతున్నారు. కానీ జనాలు వారిని గమనిస్తున్నారు. కమర్షియల్ సినిమాలు చేయడం అంత సులభమేమీ కాదు. దీనికి సరైన కొలమానం కావాలి. కరోనా సంక్షోభం ఓటీటీ కంటెంట్‌కు అలవాటు పడిన కొంతమంది జనాల మైండ్‌సెట్‌ను మార్చేసింది. కానీ వారిలో కొంత మందైతే మాత్రం థియేటర్లకు రారంటూ చెప్పుకొచ్చాడు రవితేజ. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Deepika Padukone | ప్రపంచానికి తన కూతురిని పరిచయం చేసిన దీపికా పదుకొణే.. పాప ఎంత క్యూట్‌గా ఉంది.!
Kotha Lokah Movie | ‘కొత్త లోక’ని తెలుగులో తీస్తే డిజాస్టర్ అయ్యేది : నిర్మాత నాగవంశీ