They call him OG | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ నటించిన హరిహరవీరమల్లు పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంతో విఫలమైంది. కాగా ఇక నెక్ట్స్ ఉస్తాద్భగత్ సింగ్, ఓజీ సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు పవన్ కల్యాణ్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఓజీ గ్లింప్స్ నెట్టింటిని షేక్ చేస్తోంది. అభిమానుల ఆశలన్నీ ఓజీపైనే ఉన్నాయి. కాగా ఓజీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే న్యూస్ షేర్ చేశారు మేకర్స్.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. ఓజీ మ్యూజిక్ ఫెస్టివల్ షురూకు రంగం సిద్దమైంది. ఓజీ ఫస్ట్ సింగిల్ Fire Stormను ఆగస్టు 2న శనివారం రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కోపంలో పుట్టి, పోరాటం కోసం సృష్టించబడ్డాడు.
చివరి పేజీ రాయడానికి అతను తిరిగి వచ్చాడు.
ఆగస్టు 2న కాల్పుల క్షణం ప్రీ లుక్ ఒకటి వైరల్ అవుతూ అభిమానుల్లో అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓజీ ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Born in rage, Built for the fight
He’s back to write the final page.
Firing 🔥G moment 💿
on Aug 2nd…#FireStorm#OG #TheyCallHimOG pic.twitter.com/2hi5SW78gF— DVV Entertainment (@DVVMovies) July 31, 2025
Pawan Kalyan | ఓజీ కోసం వన్స్‌మోర్ అంటోన్న పవన్ కల్యాణ్.. ఏ విషయంలోనో తెలుసా..?
Vijay Devarakonda | ‘కింగ్డమ్’ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
Param Sundari | విడుదల తేదీని ప్రకటించిన జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’