Sathyaraj | టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik). మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సత్యరాజ్ లీడ్ రోల్ రోల్లో నటిస్తుండగా..వశిష్ఠ ఎన్ సింహా, సంచి రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమా నుంచి సత్యరాజ్ పాత్ర లుక్‌తోపాటు టైటిల్ గ్లింప్స్‌ను షేర్ చేయగా సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ఫైనల్ చేశారు. ఆగస్టు 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో యాక్టర్ సత్యరాజ్ మాట్లాడుతూ.. త్రిబాణధారి బార్బారిక్ సినిమాకు పని చేయడం చాలా సంతోషంగా ఉంది. మా పాత్రలన్నీ ముఖ్యమైనవని మేమంతా చెప్పాలి.. కానీ సినిమాకు కథే రియల్ హీరో. ఈ చిత్రానికి డైరెక్టర్ మోహన్, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిజమైన బాణాలు. ఈశ్వర్ నాతో డ్యాన్స్ చేయించాడు. రమేశ్ మా అందరినీ అద్భుతంగా చూపించాడు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఇతర సీన్లను కూడా చూశా. కెమెరా యాంగిల్స్ ఎలాంటి సస్పెన్స్‌ను క్రియేట్ చేశాయో చూసి ఆశ్చర్యమేసింది. సస్పెన్స్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ అద్భుతంగా తీర్చిదిద్దారంటూ చెప్పుకొచ్చాడు.
మన సినిమాను వారి కెమెరాను ఆయుధంగా చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాల్సింది మీడియా.. అందువల్లే మీడియా మన బార్బారిక్ అన్నాడు డైరెక్టర్ మోహన్ శ్రీవాత్సవ. నీ వల్లే నీ వల్లే సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.. అదే మా తొలి బాణం. రెండో బాణం అనగ అనగ. ఈ సినిమాను క్లారిటీ, కమిట్మెంట్, కంటెంట్‌తో తీయడం జరిగిందన్నాడు. మా సినిమాను మా బాస్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నాం. సక్సెస్ చేయాలని కోరుతున్నానన్నాడు.
బార్బారిక్ ప్రపంచంలో సత్యరాజ్ పాత్ర కీలకంగా సాగనున్నట్టు గ్లింప్స్ హింట్ ఇచ్చేస్తుంది. గ్లింప్స్‌లో ఎవరు తాతా ఇతను..? అని చిన్నారి అడుగగా.. ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా.. భీష్ముడా తాతా..? హహ కాదమ్మా.. అంటూ సాగే డైలాగ్స్‌తో మాధవా.. వెయ్యేనుగుల బలశాలి భీముడికి మనవడిని. ఘటోత్కచుడుకు కుమారుడిని అంటూ బార్బరిక్ పాత్రను ఎలివేట్ చేసే ఇంట్రడక్షన్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్ కథ ఆధారంగా వస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది మారుతి టీం.
A story that shook the battlefield ⚔️
A warrior who changed destiny🔥#Barbarik Grand Release on August 22nd 💥#BarbarikOnAugust22ndA @DirectorMaruthi Team Product 💥@VijaypalreddyA @vanaracelluloid @iamraj20 @monivathsa #SathyaRaj @RKushendar @ImSimhaa @rai_sanchi… pic.twitter.com/UU1PgNTqPh
— BA Raju’s Team (@baraju_SuperHit) August 5, 2025
Film Chamber | సాప్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు.. సినీ కార్మికుల నిరసనపై ప్రసన్న కుమార్
JSK | అనుపమ పరమేశ్వరన్ జేఎస్కే మూవీ పాన్ ఇండియా ఓటీటీ డెబ్యూ.. ఏ ప్లాట్ఫాంలోనో తెలుసా..?
Kingdom Banner | విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ బ్యానర్లు చించేసిన తమిళ ప్రజలు.. ఎందుకంటే ?