Pawan Kalyan | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా వస్తుంది. హరిహరవీరమల్లు పార్ట్ 1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.
ఇప్పటికే మాట వినాలి బీటీఎస్ వీడియో రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై హైప్ పెంచేస్తుంది. తాజాగా మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌లో పవన్ కల్యాణ్‌తో పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్ డ్యాన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అనసూయ ఓ టీవీ రియాలిటీ షోలో చెప్పేసింది.
అంతేకాదు ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు అదిరిపోయే పాటలు కంపోజ్ చేసిన గణేశ్ మాస్టర్ మరోసారి ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేయబోతున్నాడట. ఎంఎం కీరవాణి మ్యూజిక్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందని సమాచారం. మొత్తానికి జ్యోతికృష్ణ ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయేలా ప్లాన్ చేశాడని అర్థమవుతుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హరిహరవీరమల్లులో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్నారు.
#HariHaraVeeraMallu Next Song #PawanKalyan Will Shake Legs With #PoojithaPonnada & #Anasuya In His Upcoming Song #GaneshMaster Choreography & #MMKeeravaani Music
Mothamogipoddi e song 💥💥 pic.twitter.com/s4rmhYuINS— Naveen Sana (@powerstarsana) January 30, 2025
మాట వినాలి బీటీఎస్ వీడియో..
The man behind the powerful vocals of #HariHaraVeeraMallu’s first single! 🌪🔥
Here’s the BTS video of #HHVM 1st Single Out Now 💥 – https://t.co/zrX96szJgI#MaataVinaali #BaatNirali #KekkanumGuruve #MaathukeLayya #KelkkanamGuruve
Sung by the one and only, POWERSTAR 🌟… pic.twitter.com/xSIKRvzCpH
— Hari Hara Veera Mallu (@HHVMFilm) January 29, 2025
మాట వినాలి లిరికల్ వీడియో..
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!
Mazaka | వైజాగ్ రోడ్లపై రావు రమేశ్, సందీప్ కిషన్.. ఇంప్రెసివ్‌గా మజాకా బ్యాచిలర్స్ ఆంథెమ్ సాంగ్