Oscars 2025 | 97వ ఆస్కార్ అవార్డ్ నామినేషన్ కార్యక్రమానికి రంగం సిద్దమైంది. 2025 మార్చి 2న జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి వివిధ దేశాల నుంచి ఎంట్రీలు వెళ్లనున్నాయి. అమీర్ ఖాన్ (Aamir Khan) నిర్మాణంలో కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies) సినిమా 2025 ఆస్కార్ (Oscars 2025)కు ఇండియా తరపున ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఈ సారి ఆస్కార్ బరిలో నిలిచే తెలుగు సినిమాలపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సారి ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీ ఇవ్వబోతున్న టాలీవుడ్ సినిమాలివేనన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. టాలీవుడ్ నుంచి ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ, తేజ సజ్జా హనుమాన్, పాయల్ రాజ్‌పుత్ నటించిన మంగళవారం బరిలో నిలిచినట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. మరి వీటిలో ఏ సినిమా ఆస్కార్‌లో అఫీషియల్ ఎంట్రీ ఇస్తుందనేది తెలియాలంటే.. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తే స్పష్టత రానుంది.
ఆస్కార్‌లో ఇతర భారతీయ సినిమాలు కూడా ఆస్కార్‌లో సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. నాటు నాటు పాటకు గాను ప్రతిష్టాత్మక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్‌ను అందుకుంది జక్కన్న టీం. మరి ఈ సారి ఏ తెలుగు సినిమా ప్రపంచ వేదికపై మెరుస్తుందో చూడాలి.
Chiranjeevi | నా డ్యాన్స్‌లను ఇష్టపడిన ప్రతీ ఒక్కరికి అంకితం : గిన్నీస్ రికార్డ్‌పై చిరంజీవి
Priyanka Jawalkar | ట్రిప్‌లో స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Chiranjeevi | గిన్నీస్ రికార్డ్.. Most Prolific Film Star అవార్డు అందుకున్న చిరంజీవి
Chiranjeevi | డ్యాన్సుల్లో చిరంజీవి అరుదైన ఫీట్.. తొలి యాక్టర్‌గా గిన్నీస్ రికార్డ్