మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 13:50:06

బాలీవుడ్‌లో బంధుప్రీతి లేదు : జెమీ

బాలీవుడ్‌లో బంధుప్రీతి లేదు : జెమీ

ముంబై : బాలీవుడ్‌లో ప్రముఖ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బంధుప్రీతిపై విమర్శలు వినిపిస్తునాయ. తాజాగా బాలీవుడ్ బంధుప్రీతిపై ప్రముఖ హాస్యనటుడు జానీ లీవర్ కుమార్తె జెమీ కీలక వ్యాఖ్యలు చేసింది.  తానెప్పుడూ ఓ నటుడి కుమార్తెగా ఫీలవ్వలేదని చెప్పుకొచ్చింది. ‘చెప్పేందుకు ఇష్టం లేనప్పటికీ బంధుప్రీతి గురించి మీకు చెబుతున్నా.. నటీనటుల పిల్లలందరికీ సినిమా అవకాశం దక్కవు. బాలీవుడ్‌లో అతి ఇష్టం వంటిది ఉండొచ్చేమో కానీ బంధుప్రీతి ఉండదు' అని జేమీ నెపోటిజంపై తన అభిప్రాయన్ని తెలిపింది.

‘మా నాన్న నటనను కేవలం వృత్తిగానే భావించారు. జీవితంగా భావించలేదు. షూటింగ్‌కు వెళ్లి వచ్చి తన నిజ జీవితం గడిపేవారు. సినిమా స్టార్ల వేడుకలకు వెళ్లేవారు కాదు. నా తల్లిదండ్రులు ముందు నుంచి చిత్ర పరిశ్రమకు చెందినవారు కాదు' అని జేమీ పేర్కొంది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo