మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ జరిగింది. దీనిపై మంచు విష్ణు, అతని మేనేజర్ సంజయ్ ఇద్దరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్లో విష్ణు ఛాంబర్లో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి విష్ణుకు సంబంధించిన హెయిర్ డ్రెస్సింగ్ ఎక్విప్మెంట్ను ఎవరో దొంగిలించారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంజయ్.. విష్ణు హెయిర్ డ్రెస్సర్‌గా పని చేసే నాగ శ్రీను కూడా కనిపించడం లేదని వెల్లడించాడు. అతనే విష్ణుకు సంబంధించిన సామగ్రిని దొంగిలించి ఉండొచ్చని ఫిర్యాదు చేశాడు. దొంగిలించిన హెయిర్ డ్రెస్సింగ్ వస్తువుల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.