‘ఈ చిత్ర దర్శకుడు, హీరో సుమంత్ ప్రభాస్ గతంలో చేసిన షార్ట్‌ఫిల్మ్ చూశాను. అప్పుడే అతనిలో మంచి టాలెంట్ ఉందని అర్థమైంది. ఈ సినిమాతో అతను మరో స్థాయికి చేరుకుంటాడు’ అని అన్నారు హీరో నాని. బుధవారం జరిగిన ‘మేమ్ ఫేమస్’ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్వీయ దర్శకత్వంలో సుమంత్ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. నాని మాట్లాడుతూ ‘మంచి కంటెంట్‌తో ఈ సినిమా తీశారు. టాలెంటెడ్ యూత్ అందరూ కలిసి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రమోషన్స్ కూడా కొత్తగా చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సృష్టించడం ఖాయం’ అన్నారు.
‘ఈ సినిమానే జీవితం అనే పట్టుదలతో టీమ్ అంతా శ్రమించాం. యువతను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశాం. ఎక్కడా అసభ్య సన్నివేశాలు కనిపించవు. పెద్దలు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు’ అని దర్శకుడు, హీరో సుమంత్ప్రభాస్ పేర్కొన్నాడు. నిర్మాతల్లో ఒకరైన శరత్ మాట్లాడుతూ ‘యువతరం తలచుకుంటే ఏదైనా సాధించగలరనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆద్యంతం వినోదంతో ఆకట్టుకంటుంది’ అన్నారు.