మియాపూర్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): సోషల్‌మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న పలువురు యాంకర్లపై ఇటీవలే పంజాగుట్ట పోలీసులు కేసునమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇదే విషయమై మియాపూర్ ప్రగతినగర్‌కు చెందిన ప్రదీప్‌శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రముఖ సినీనటులు దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాశ్‌రాజ్, నిధి అగర్వాల్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు వీరిపై పలు సెక్షన్ల కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.