సమరసింహారెడ్డి స్వీయ రచనతో హీరోగా నటిస్తున్న చిత్రం ‘మగపులి’. ‘ఫార్మర్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. అక్సాఖాన్ కథానాయిక. తెలుగు శ్రీను దర్శకుడు. నారాయణస్వామి నిర్మాత. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సుమన్ క్లాప్ ఇవ్వగా, రైతు టి.రంగడు కెమెరా స్విచాన్ చేశారు.
సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. నిరుద్యోగులు, రైతులు, డ్రైవర్లు, రాజకీయనాయకులు వీరి నేపథ్యంలో సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పాడు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హీరోహీరోయిన్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్.జె, కెమెరా: శివారెడ్డి ఎస్వీ.