Kannappa Movie – Pushpa | టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా హాలీవుడ్ లెవల్లో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ ఇదే నిజమైతే మంచు విష్ణు భారీ సాహసం చేయబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే డిసెంబర్‌ను బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ బుక్ చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa The rule) రాబోతుంది. డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమాకు పోటిగా కన్నప్పను దించడం అనేది సాహసం కూడుకున్న పని అని ఇది కన్నప్పకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కాగా కన్నప్ప విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read..