Mardaani | యష్‌రాజ్ ఫిల్మ్స్వారి ‘మర్దానీ’ ఫ్రాంచైజీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ పదేళ్లలో వచ్చిన రెండు సీజన్లూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. దేశంలోని అతిపెద్ద మహిళా కాప్ ఫ్రాంచైజీగా ‘మర్దానీ’ రికార్డులకెక్కింది. ప్రస్తుతం ‘మర్దానీ’ మూడో సీజన్‌కు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు.
న్యాయంకోసం నిస్వార్థంగా పోరాడే డేర్ డెవిల్ శివానీ శివాజీరాయ్‌గా రాణీముఖర్జీ మళ్లీ ఈ ‘మర్దానీ 3’లో కనిపించనున్నారనీ, వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న హోలీ పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానున్నదని సోమవారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకలా ‘మర్దానీ 3’ ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ మాస్‌ని ఆకట్టుకునేలా ఉంది.