సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ ‘ది లక్’ పేరుతో ఓ రియాలిటీషోను ప్రారంభించనుంది. దేశంలోనే తొలిసారిగా కేవలం సామాన్యులు మాత్రమే తమ షోలో భాగస్వాములు అయ్యేలా తీర్చిదిద్దామని నిర్వాహక బృందం తెలిపింది. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ‘ది లక్’ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా షో క్రియేటివ్ డైరెక్టర్స్ శ్రేయాస్ సీఎం, సూర్య తోరమ్స్, అపురూప షో తాలూకు వివరాలను తెలియజేశారు. ధైర్యం, వ్యూహం, ఓర్పు ప్రధానాంశాలుగా ఈ షో ఉంటుందని, ప్రతీ విజేతకు 10లక్షల బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.