ఓ వైపు సినిమాలతో, మరోవైపు సోషల్ మీడియాతో బిజీగా గడిపేస్తుంటుంది అందాలభామ శ్రీలీల. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో నటిస్తున్న ఈ తెలుగమ్మాయి రీసెంట్గా తన ఇన్‌స్టాలో అభిమానులతో చాట్ సెషన్‌ని నిర్వహించింది. అందులో ఓ అభిమాని పెట్టిన మెసేజ్ హైలైట్‌గా నిలిచింది. ‘ప్రస్తుతం నేను నిరుత్సాహంగా ఉన్నాను. మనసేం బాలేదు’ అని ఆ అభిమాని పెట్టిన మెసేజ్‌పై శ్రీలీల స్పందించింది.
‘ఈ విషయంలో నీకు హెల్ప్ చేయగలనో లేదో తెలీదు కానీ… ఓ సలహా మాత్రం ఇస్తా. నేరుగా వెళ్లి మీ కుటుంబంలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తిని గట్టిగా హగ్ చేసుకో. నా మనసు బాగుండకపోతే నేను అదే చేస్తా.’ అంటూ సలహా ఇచ్చేశారు శ్రీలీల. అభిమాని బాధపై ఆమె స్పందించిన తీరుని చూసిన వారంతా శ్రీలీలను అభినందనలతో ముంచెత్తుతున్నారు.