The Life Of Muthu Censor Report | ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు శింబు. గత కొంత కాలంగా ఫ్లాప్‌లలో ఉన్న శింబు ‘మానాడు’ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన వెంధు తానిందాతు కాదు విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో ది లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. రన్ టైం 2 గంటల 53 నిమిషాలుగా ఉండనుంది. ‘వల్లభ’ తర్వాత ఇంత ఎక్కువ రన్‌టైం శింబు కెరీర్లో ఇదే అవడం విశేషం. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగం గురువారం తమిళంతో పాటు తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కే.గణేష్ నిర్మించాడు. ఈ చిత్రంలో శింబుకు జోడీగా సిద్ది ఇద్నాని హీరోయిన్గా నటించింది. ఇక ఈ చిత్రం కోసం శింబు 15 కేజీల వరకు బరువు తగ్గనున్నాడట.
Read Also:
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..!
Super Good Films | సూపర్ గుడ్ ఫిలింస్ 100వ చిత్రంలో ఆ స్టార్ హీరో నటిస్తున్నాడా?
Alluri Movie | శ్రీ విష్ణు ‘అల్లూరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్?
Raviteja | రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరణ్?