Raviteja | రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరణ్?
Anupama Prameshwaran | రవితేజ ఇటీవలే కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సైన్ చేశాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరణ్ను ఎంపిక చేశారట. ఈ చిత్రానికి ఈగల్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు.
Anupama Prameshwaran | ఫలితం ఎలా ఉన్నా రవితేజ మాత్రం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది విడుదలైన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’లు వరుసగా విఫలం అవడంతో రవితేజ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. ప్రస్తుతం రవితేజ అభిమానులు ఆయన కంబ్యాక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రవితేజ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్స్‌లో పెట్టాడు. ఇక మూడు చిత్రాలు ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మాస్రాజ ఇటీవలే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేనితో ఓ సినిమాకు సైన్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించనుంది.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారట. కాగా ఈ చిత్రంలో రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ను హీరోయిన్గా ఎంపిక చేశారట. కార్తికేయ-2 చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా కార్తిక్ ఘట్టమనేని పనిచేసిన విషయం తెలిసిందే. అనుపమతో ఉన్న సాన్నిహిత్యంతోనే కథను నెరేట్ చేయగా.. తను వెంటనే ఓకే చెప్పిందట. ఈ చిత్రంలో రవితేజ అల్ట్రా స్టైలిష్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ‘ఈగల్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలనలో ఉంచారట. రీవేంజ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ జాన్ విక్ చిత్రాన్ని బేస్ చేసుకుని దర్శకుడు కథను రూపొందించాడట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

