Super Good Films 100th Movie | దక్షిణాది అగ్ర నిర్మాణ సంస్థలలో ‘సూపర్ గుడ్ ఫిలింస్’ ఒకటి. తమిళం, తెలుగు, మలయాళంలో సినిమాలను నిర్మించి ప్రతి ఇండస్ట్రీలో సక్సెస్‌ను సాధించింది. ఈ సంస్థకు ఆర్.బి చౌదరి నిర్వాహకుడుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సంస్థలో చిరు ‘గాడ్‌ఫాదర్’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ఈ సంస్థలో తెరకెక్కిన మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సంస్థ 100వ చిత్రంలో హీరోగా కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్నాడట.
ఈ విషయాన్ని స్వయంగా ఆర్.బి చౌదరి తనయుడు, నటుడు జీవా మీడియా సమావేశంలో తెలిపాడు. ‘తన తండ్రిని కొన్ని రోజుల క్రీతం విజయ్ కలిసి, తమ నిర్మాణ సంస్థకు ప్రత్యేకంగా నిలవనున్న 100వ సినిమాలో హీరోగా నటించేందుకు సుముఖత వ్యక్తం చేశాడని’ జీవా తెలిపాడు. గతంలో వీళ్ళ కాంబోలో ‘స్నేహితుడు’ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. విజయ్‌కు జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తుంది.
Read Also:
Alluri Movie | శ్రీ విష్ణు ‘అల్లూరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్?
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..!
Raviteja | రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరణ్?
Ponniyin Selvan | ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్యరాయ్ విలన్‌గా నటిస్తుందా?