Sree Vishnu’s Alluri Movie Pre-Release Event | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను పరిచయం చేయడంలో శ్రీ విష్ణూ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇటీవలే ఈయన నటించిన ‘భళా తందనాన’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం శ్రీవిష్ణు ‘అల్లూరి’ అనే యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస ప్రమోషన్లతో బిజీగా గుడుపుతున్నారు.
ప్రమోషన్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లు అర్జున్ను పిలిచిరాట. దీనిపై త్వరలోనే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రానుంది. అల్లు అర్జున్ గెస్ట్‌గా వస్తే సినిమాకు విపరీతమైన బజ్ పెరుగుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శ్రీ విష్ణూ ఎప్పటిలాగానే ఈ సారి కూడా విభిన్న కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. కాగా ఈసారి కమర్షియల్ హంగులను కూడా జోడించాడు.
Read Also:
Raviteja | రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరణ్?
Ponniyin Selvan | ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్యరాయ్ విలన్‌గా నటిస్తుందా?
Chiru 154 | చిరు సినిమాలో వెంకీ మామా.. సంబురాల్లో మెగా, దగ్గుబాటీ ఫ్యాన్స్