Chiru 154 | చిరు సినిమాలో వెంకీ మామా.. సంబురాల్లో మెగా, దగ్గుబాటీ ఫ్యాన్స్
Venkatesh Guest Appearance In Chiru154 | ఇటీవలే ఆచార్యతో ఫ్లాప్‌ను అందుకున్న చిరు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బాస్టర్‌ను సాధించలని కసితో ఉన్నాడు. ఈ చిత్రంలో విక్టరి వెంకటేష్ కూడా భాగం కానున్నట్లు తెలుస్తుంది.
Venkatesh Guest Appearance In Chiru154 | ఫలితం ఎలా ఉన్నా చిరంజీవి మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘ఆచార్య’తో చిరు భారీ ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ ఒకటి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో విక్టరి వెంకటేష్ కూడా భాగం కానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో వెంకీమామ గెస్ట్ రోల్ ప్లే చేయనున్నాడట. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతో అడగ్గానే ఒకే చెప్పాడట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుందట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త తెలిసినప్పటి నుండి అటు చిరు ఫ్యాన్స్, ఇటు వెంకీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. గతంలో వెంకటేష్, పవన్ కళ్యాణ్‌తో కలిసి గోపాల గోపల సినిమాలో నటించగా.. అజ్ఞాతవాసి సినిమాలో వెంకీ మామ గెస్ట్ రోల్ ప్లే చేశాడు.
ఈ చిత్రం చిరంజీవికి 154వ మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చిరు అండర్ కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

