Ponniyin Selvan | ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్యరాయ్ విలన్‌గా నటిస్తుందా?
Aishwarya Rai | చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అందాల తార ఐశ్వర్యరాయ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ ప్రతినాయక పాత్రలో నటిస్తుందట.
Aishwarya Rai | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలుంటాయి. ప్రేమకథా చిత్రాలకే మణిరత్నం టేకింగ్ గాని, డీటేయిలింగ్ గాని ఒక రేంజ్లో ఉంటాయి. అలాంటిది ఈ సారి ఏకంగా పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడంటే ఇంకా ఏ స్థాయిలో తన టేకింగ్ ఉండనుందో అని ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అందాల తార ఐశ్వర్యరాయ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ఐశ్వర్య ద్విపాత్రాభినయం చేస్తుందట. అందులో ఒక పాత్ర నెగిటీవ్ షేడ్స్‌తో ఉండనుందట. ఆ పాత్రే సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోందట. కోలీవుడ్‌కు ఐశ్వర్యరాయ్‌ను హీరోయిన్గా పరిచయం చేసిన మణిరత్నం, ఈ సారి విలన్‌గా పరిచయం చేస్తున్నాడు. ఐశ్వర్యరాయ్ గతంలో ఖాకీ సినిమాలో నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పిచ్చింది.
పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని ప్రముఖ రైటర్ కల్కీ కృష్ణమూర్తీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. మొదటి భాగం సెప్టెంబర్ 30న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Also:
Chiru 154 | చిరు సినిమాలో వెంకీ మామా.. సంబురాల్లో మెగా, దగ్గుబాటీ ఫ్యాన్స్
Varasudu Movie | భారీ ధరకు ‘వారసుడు’ నాన్-థియేట్రికల్ హక్కులు..!
Thalapathy67 | విజయ్-లోకేష్ మూవీ కోసం సంజయ్‌దత్ అన్ని కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

