Thalapathy67 | విజయ్-లోకేష్ మూవీ కోసం సంజయ్‌దత్ అన్ని కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడా?
Thalapathy67 | విజయ్- లోకేష్ కనగరాజు రెండో చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రం కోసం సంజయ్ దత్ భారీ స్థాయిలో పారితోషికాన్ని అందుకున్నాడు.
Sanjay Dutt Remuneration | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం స్పీడు మీదున్నాడు. వరుసగా కథలను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన ‘బీస్ట్’ తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా ఈ చిత్ర ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ప్రస్తుతం ఈయన వంశీపైడిపల్లి దర్శకత్వంలో నేరుగా తెలుగులో వారసుడు సినిమా చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన విజయ్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ చివర్లో సెట్స్‌పైకి వెళ్ళనుంది.
లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని గ్రాండియర్‌గా, భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక నటీనటుల విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా బిగ్ స్టార్ కాస్ట్‌ను ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను కీలకపాత్ర కోసం ఎంపిక చేశాడు. ఇదిలా ఉంటే తాజాగ ఈయన రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం కోసం సంజయ్ దత్ దాదాపు రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేశాడట. దానికి మేకర్స్ కూడా ఒప్పుకున్నారట. ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఎక్కవ రోజులే కాల్షీట్లు ఇచ్చాడని టాక్.
విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగానే అంచనాలున్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన మాస్టర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం కూడా లోకేష్ తన మల్టీవర్స్‌లో భాగంగానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రం కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను లోకేష్ రంగంలోకి దింపనున్నట్లు టాక్.
Read Also:
SSMB28 Movie | మహేష్-త్రివిక్రమ్ ‘SSMB28’ షూటింగ్ ప్రారంభం.. ఫోటోస్ వైరల్
Ponniyin Selvan | భారీ ధరకు ‘పొన్నియన్ సెల్వన్’ ఓటీటీ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Krishnam Raju | రెబల్‌స్టార్ కృష్ణంరాజు కూతుళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

