Ponniyin Selvan | భారీ ధరకు ‘పొన్నియన్ సెల్వన్’ ఓటీటీ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Ponniyin Selvan | తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్-1'. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు
Ponniyin Selvan Digital Rights | తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-1’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు. కాగా మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై మణిరత్నం మ్యాజిక్‌ను చూద్ధామా అని ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘పొన్నియన్ సెల్వన్’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసిందట. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్‌లకు కలిపి ప్రైమ్ వీడియో సంస్థ సుమారు రూ.125 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇంకా మొదటి భాగం విడుదల కాకముందే ఈ స్థాయిలో డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయంటే విశేషం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. రోజు రోజుకు ఈ చిత్రంపై క్రేజ్ పెరుగుతూనే ఉంది.
చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Read Also:
Krishnam Raju | రెబల్‌స్టార్ కృష్ణంరాజు కూతుళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
SJ Suryah | ట్వీట్‌తో ఎస్జే సూర్య ఇంట్రెస్టింగ్ అప్డేట్
Amapa Paul | తెలుగులో అందుకే కొన్ని సినిమాలే చేశా..’నెపోటిజం’పై అమలాపాల్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

