‘ఈ సినిమా మీదున్న నమ్మకంతో రెండు రోజుల ముందు ప్రీమియర్షోస్ వేశాం. అద్భుతమైన స్పందన లభించింది. ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు హీరో తిరువీర్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. టీనా శ్రావ్య కథానాయిక. నేడు విడుదలకానుంది. గురువారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ప్రీ వెడ్డింగ్ షూట్ నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథా చిత్రమిదని, ఆద్యంతం వినోదంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ప్రీమియర్లకు వచ్చిన స్పందన విజయంపై నమ్మకాన్ని పెంచిందని, కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా ఉంటుందని నిర్మాతలు సందీప్ అగరం, అష్మిత రెడ్డి చెప్పారు.