రసమయి ఫిలిమ్స్ పతాకంపై కవి, గాయకుడు, శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకుడు. సోమవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో జగపతిబాబు ను భీమ్రావ్ దొరగా పరిచయం చేశారు. ‘రుద్రంగి నాది..రుద్రంగి బిలాంగ్స్ టు మీ’ అంటూ ఆయన చెప్పిన శక్తివంతమైన డైలాగ్ ఆకట్టుకుంటున్నది.
దర్శకుడు మాట్లాడుతూ ‘యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా పవర్ఫుల్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తున్నది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నా రు. ఆశిష్‌గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్‌దాస్, కాలకేయ ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సంతో ష్, నిర్మాత: రసమయి బాలకిషన్.