ఎస్కెఎల్ఎమ్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘హలో బేబీ’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. అరోరా శ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రాంగోపాల్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. ఓ యువతి జీవిత ప్రయాణంలోని అనూహ్య మలుపులను ఆవిష్కరిస్తుంది. విభిన్నమైన కథతో ఆకట్టుకుంటుంది’ అన్నారు.
ఇప్పటివరకు తెలుగు తెరపై రానటువంటి వినూత్న కథ ఇదని నిర్మాతలు తెలిపారు. మహిళా ప్రధాన చిత్రంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని కథానాయిక అరోరా శ్రీ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రమణ, సంగీతం: నితిన్, ఎడిటర్: సాయిరాం.