హీరోల ఇమేజ్ వల్లే సినిమాలు ఆడుతున్నాయని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని చెప్పింది సీనియర్ కథానాయిక అమీషాపటేల్. హీరోలతో సమానంగా కథానాయికలకు కూడా పారితోషికం దక్కాలనే వాదన అర్థం లేనిదని ఆమె పేర్కొంది. అమీషాపటేల్ ప్రధాన పాత్రలో నటించిన ‘గదర్-2’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
ఈ సందర్భంగా అమీషాపటేల్ మట్లాడుతూ ‘బాలీవుడ్లో పారితోషికాల విషయంలో వివక్ష ఏమీ లేదు. హీరోల వల్లే మెజారిటీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌తో సమానంగా నేను రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే హాస్యాస్పదంగా ఉంటుంది. ఏవో కొన్ని లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయనే కారణంతో సమాన పారితోషికాల డిమాండ్ చేయడం సరైంది కాదు. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు ప్రపంచంలో ఏ సినిమా రంగాన్ని తీసుకున్నా హీరోలదే ఆధిపత్యం’ అని అమీషాపటేల్ పేర్కొంది.