హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘కోనసీమ థగ్స్’. మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో రియా షిబు, హెచ్ఆర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వీడియో సాంగ్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. నిర్మాత మాట్లాడుతూ ‘పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఉత్కంఠను పంచుతుంది. అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్‌డ్రాప్‌లో పాటను విడుదల చేశాం. ‘వీర శూర మహంకాళి వస్తోందయ్యా..వేటాడను ఆ తల్లే వస్తోందయ్యా’ అంటూ సాగే ఈ పాట చిత్రంలో కీలక సన్నివేశంలో రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రం విడుదల కానుంది.