Keeda-Cola Movie | గ్రాండ్‌గా తరుణ్‌భాస్కర్ ‘కీడా కోలా’ పూజా కార్యక్రమాలు.. ఫోటోస్ వైరల్
Keeda-Cola Movie Pooja Ceremony | షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ మొదలు పెట్టి.. ‘పెళ్ళి చూపులు’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ చిత్రం తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కించి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా చాలా మంది యూత్‌కు ఫేవరెట్ మూవీగా మారిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని దర్శకుడిగా ‘కీడా కోలా’ అనే క్రైమ్ కామెడీ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
కాగా మంగళవారం రోజున కీడా కోలా పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా ప్రారంభమైయ్యాయి. ఈ వేడుకకు టాలీవుడ్ నుండి పలువురు సెలబ్రెటీలు గెస్ట్లుగా వచ్చారు. సురేష్‌బాబు, హీరో సిద్ధార్థ్, సుహాస్, రాజా గౌతమ్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు ఈ వేడుకకు వచ్చారు. ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. వీజి సైన్మా, క్విక్ ఫాక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడదుల కానుంది.
Pooja Ceremony of #KeedaaCola has happened today! 👍🏻
Many celebrities of T-Town graced the event! 🌟
Written & Directed by @TharunBhasckerD 🎬
A PAN India Release in 2023 🪳🍯#VGSainma #QuickFox @sripadnandiraj @UpendraVg @Mesaikrishna #TBD3 pic.twitter.com/Twc30ZjiF3— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

