టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram ) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం స్పెయిన్‌లో టాకీపార్టుతోపాటు పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఓ పాట చిత్రీకరిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వారితో జాయిన్ అయ్యాడు. లొకేషన్లో మహేశ్‌బాబుతో థమన్ (Thaman) కలిసి దిగిన ఫొటోను మేకర్స్ విడుదల చేయగా నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. థమన్, మహేశ్ ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో కనిపిస్తూ..మ్యాచింగ్ షూస్ వేసుకున్నట్టు స్టిల్ చూస్తే తెలిసిపోతుంది.
ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే సినిమాపై అంచనాలు మామూలుగా ఉండవనే విషయం తెలిసిందే. తన సంగీతంతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లే టాలెంట్ థమన్ సొంతం. మరి మహేశ్ కోసం థమన్ ఎలాంటి ఆల్బమ్ సిద్దం చేస్తాడోనని చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
Latest Click of Superstar @urstrulyMahesh & @MusicThaman from the sets of #SarkaruVaariPaata pic.twitter.com/MLsiEqW5AW
— BA Raju's Team (@baraju_SuperHit) October 22, 2021
గత కొన్నేళ్లలో భారత్‌లో సెన్సేషన్ సృష్టించిన బ్యాంకు మోసాలు, ఆర్థిక నేరాల నేపథ్యంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ అంశాలను సృశిస్తూ ఈ చిత్రం సాగనుందని టాక్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో దుబాయ్‌కు రవితేజ..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత