‘అఖండ’ ఇంటర్వెల్ సీక్వెన్స్ గుర్తొస్తేనే గూజ్బంప్స్ వచ్చేస్తాయి. ఆ స్థాయిలో తెరకెక్కించారు దర్శకుడు బోయపాటి శ్రీను. సినిమాలో అఘోరా పాత్ర ఎంటరయ్యేది కూడా ఆ సీన్లోనే. ఆ ఎపిసోడ్లో తమన్ ఇచ్చిన ఆర్.ఆర్ అద్భుతమైతే.. బాలకృష్ణ స్క్రీన్ ప్రెజన్స్ మహాద్భుతం. ప్రస్తుతం ‘అఖండ’ సీక్వెల్‌గా ‘అఖండ – తాండవం’ సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సీక్వెల్‌కి సంబంధించిన ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్‌ను మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.
ఈ సెట్లోనే రెండువారాల పాటు ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారట. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఈ ఫైట్ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తున్నది. తొలి పార్ట్ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ని మించేలా ఈ ఎపిసోడ్ ఉంటుందని బోయపాటి టీమ్ చెబుతున్నది. సినిమా మొత్తానికీ ఈ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని వారు నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం హిమాలయాల్లో బాలయ్య అఘోరా పాత్రపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక, ఇంటర్వెల్ ఎపిసోడ్ షూట్ మొదలవుతుందట. 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.