Jana Nayagan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రస్తుతం దళపతి 69 సినిమాతో బిజీగా ఉన్నాడని మూవీ లవర్స్ అందరికీ తెలిసిందే. కార్తీ (ఖాకీ) ఫేం హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జన నాయగన్ (ప్రజల నాయకుడు) టైటిల్ (Jana Nayagan)తో వస్తోంది.
ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌తోపాటు టైటిల్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. విజయ్ ఏప్రిల్ చివరి కల్లా తన పార్ట్‌కు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయనుండగా.. మే లేదా జూన్ కల్లా మొత్తం షూటింగ్ కంప్లీట్ కానున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా మంచి సమయం దొరకనుందన్నమాట. అంతేకాదు విజయ్ ఈ మూవీ షూట్ పూర్తయిన తర్వాత తన పొలిటికల్ జర్నీపై ఫోకస్ పెట్టనున్నాడని సమాచారం. ఇంకేంటి మరి త్వరలోనే సినిమాకు సంబంధించిన పనులను చక చకా ముగించేయడంతో అభిమానులు కొత్త అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
Jailer 2 | జైలర్2 క్రేజీ అప్డేట్.. బాలయ్య, సూర్య మధ్య బీభత్సమైన సన్నివేశాలా?